22-02-2025 12:48:32 PM
మైలార్ దేవ్ పల్లి లక్ష్మీగూడ లో భార్య న్యాయపోరాటం
రాజేంద్రనగర్: ఓ మహిళ తన భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన ఘటన మైలర్ దేవుపల్లి(Mylardevpally)లోని లక్ష్మిగూడలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు ఆమెకు మద్దతుగా నిలిచారు. వివరాలు.. నాలుగు సంవత్సరాల క్రితం శివ, లహరి దంపతుల వివాహం జరిగింది. అయితే కొంతకాలంగా లహరిని శివ శారీరకంగా, మానసికంగా వేదిస్తున్నాడు. అతడు తప్ప తాగి భార్య పై దాడి చేశాడు. అకారణంగా బూతులు తిడుతూ విచక్షణారహితంగా చితకబాదాడు. అత్తా, భర్తలు కలసి వేదిస్తున్నారని లహరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తావా అంటూ భార్యను ఇంటి నుండి గెంటేశారు. ఆరు నెలలుగా శివ భార్య ఊసు ఎత్తడం లేదు. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు భర్త ఇంటి ఎదుట లహారితో పాటు తన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.