22-04-2025 01:18:13 AM
పాపన్నపేట ఏప్రిల్ 21 మద్యానికి బానిసగా మారి ఇబ్బంది పెడుతున్నాడని భార్య, కూతురుతో కలిసి భర్తను హతమార్చిన సంఘటన పాపన్నపేట మండలంలో వెలుగుచూసింది. ఎస్.ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం మండల పరిధిలోని నామాపూర్ గ్రామానికి చెందిన గొల్ల జోగయ్య (51) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసగా మారాడు.
ప్రతి రోజూ మద్యం తాగి ఇంటికి రావడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. విసుగు చెందిన భార్య నాగమ్మ ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చిన్న కూతురుతో కలిసి జోగయ్య మెడకు చీరతో ఉరి బిగించి హత్య చేసింది. సాయంత్రం సమయంలో పొరుగున ఉన్నవారు జోగయ్య ఇంటికి వెళ్ళారు. ఇంట్లో చలనం లేకుండా జోగయ్య పడి ఉండటాన్ని గమనించి చికిత్స కోసం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అక్కడే మార్చురీలో శవాన్ని భద్రపరిచారు. సో మవారం బంధువులకు విషయం తెలువడంతో వారు అక్కడికి చేరుకొని పరీక్షించగా జోగయ్య మెడకు కమిలిన గాయం కనిపించింది.
అనుమానం వచ్చి భార్య నాగమ్మను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొనిపరిశీలించారు. మృతు డి సోదరి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.