27-04-2025 12:00:00 AM
మహేశ్వరం, ఏప్రిల్ 26: ప్రియుడి మో జులో పడి ఓ వివాహత తన భర్త ప్రాణా లు తీసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండ లం దన్నారం గ్రామానికి చెందిన మంద ప్రవీణ్(36)తో 15ఏళ్ల క్రితం శిరీషతో వివా హమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ప్రవీణ్ ను తన ప్రియుడితో కలిసి హత్యచేసి, ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రవీణ్ తమ్ముడు శ్రీకాంత్ అనుమానంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో శిరీషతో పాటు చెవులపల్లి మహేశ్, మరో మహిళ అలివేలును పోలీసులు విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.