21-04-2025 01:15:59 PM
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్ బీ(KPHB Colony)లో దారణం చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్తను చంపి పూడ్చిపెట్టింది. భర్త(husband)పై విరక్తితో ఈ దారుణానికి ఒడిగట్టింది. 15 ఏళ్లుగా భార్యాభర్తలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. భార్య, భర్త ఇద్దరికీ వేరువేరుగా వివాహేతర సంబంధాలున్నాయి. దీంతో భార్యాభర్తులు కొన్నాళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. భర్త వేధింపులు భరించలేక చెల్లెలి భర్త సహాయంతో హత్య చేసింది. భర్త సాయిలును కారెంట్ షాకుతో చంపి భార్య కవిత అనుమానం రాకుండా పూడ్చిపెట్టింది. భర్త శవాన్ని పూడ్చిపెట్టిన కవిత సొంతూరికి వెళ్లిపోయింది. భర్త సాయిలు పనికి వెళ్లి తిరిగి రాలేదని గ్రామంలో కవిత అందరినీ నమ్మించింది. కవితపై అనుమానంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్ బీపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.