దహెగాం: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలకేంద్రానికి చెందిన బండ మల్లేష్( 33), ఎల్లూర్ గ్రామానికి చెందిన చెనవేణి బాపు, భీమక్క ల కూతురు మంజుల అలియాస్ సుజాత (30)కి 13 సంవత్సరాలక్రితం పెళ్లయింది. 6సంవత్సరాల క్రితం సుజాత అదే గ్రామానికి చెందిన గుర్ల రాజు( 23 )తో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. గత సంవత్సరం క్రితం మల్లేష్ కు విషయం తెలియడంతో గొడవపడి కొంత కాలం పాటు దూరంగా ఉన్నారు. 4 నెలల క్రితం సుజాత తల్లిదండ్రులు మధ్యవర్తి ద్వారా మల్లేష్ తో మాట్లాడి ఇద్దరిని ఒక్కటి చేశారు. అయినా సుజాత తీరులో మార్పు రాకపోవడంతో తరుచు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సుజాత, ప్రియుడు రాజుతో కలిసి మల్లేష్ అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ నెల 25 న సుజాత రాజు ప్రోత్సాహంతో మల్లేష్ గొంతును పిసికింది. దీంతో మల్లేష్ అన్న, సోదరి కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్యం అందించి ఇంటికి తీసుకొని వచ్చారు. 28న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంచిర్యాల హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.