calender_icon.png 26 April, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య

26-04-2025 04:15:15 PM

రంగారెడ్డి,(విజయక్రాంతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నా డని కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కందుకూరు మండలం ధన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్, ప్రమీలకు వీరికి ఇద్దురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా ప్రమీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఎక్కువయ్యాయి. శుక్రవారం అర్థరాత్రి ప్రియుడితో కలిసి ప్రమీల భర్త ప్రవీణ్ ను ఉరివేసి చంపేసింది.

తర్వాత ప్రవీణ్ తనకు తనుగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా అందరిని నమ్మించేందుకు ప్రమీల ప్రయత్నించింది. ప్రమీల ప్రవర్తనపై అనుమానం వచ్చి మృతుడి తల్లిదండ్రులు, గ్రామాస్తులు కందుకూరు పోలీసులకు సమాచారం అదించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిన భార్త ప్రమీలను, ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడ్డింది. ప్రవీణ్ ను వారే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కందుకూరు పోలీసులు పేర్కొన్నారు.