జార్ఘండ్ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కల్పనా సోరెన్
ఖుంటి (జార్ఘండ్), నవంబర్ 9: జార్ఘండ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల ప్రచారం ఊపందుకుంది. అయితే ప్రస్తుతం జార్ఘండ్ రాజకీయాల్లో ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కల్పనా సోరెన్.. ఈమె స్వయాన ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ భార్య. ఈ యేడాది జనవరిలో అవినీతి కేసులో హేమంత్ సోరెన్ అరెస్టున తర్వాత కల్పనా సోరెన్ జార్ఘండ్ ముక్తి మోర్చా(జేఎన్‌ఎం) పార్టీ ప్రచార పగ్గాలను అన్నీ తానై చూసుకున్నారు.
ఈ యేడాది జూన్‌లో సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఏడు నెలల కాలంలో కల్పనా సోరెన్ తన ప్రసంగాలతో గిరిజనులను ఆకర్షించారు. ఆమె ఏ సభ పెట్టినా గిరిజనలు వేల సంఖ్యలో రావడం మొదలు పెట్టారు. ఆమె ఒక్క పిలుపు ఇస్తే చాలు గిరిజనులు తండోపతండాలుగా సభలకు పోటెత్తుతున్నారు. ర్ఘండ్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న తన భర్తను లక్ష్యంగా చేసుకున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌పై కల్పనా సోరెన్ చేసిన విమర్శల్ని ప్రజలు విశ్వసించారు.
ఈ సందర్భంగా జేఎన్‌ఎం నేత అయిన ఒకరు మాట్లాడుతూ..కల్పనా జీ మీటింగ్ కోసం రోజుకు 10 అభ్యర్థనలు వస్తున్నాయి. అయితే అన్ని చోట్లా ప్రచారం సాధ్యం కావడం లేదని చెప్పారు.