calender_icon.png 29 April, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుపారి ఇచ్చి భర్త హత్యకు భార్య కుట్ర

28-04-2025 10:13:00 PM

భార్యతో పాటు మరో ఐదుగురు అరెస్ట్..

ఎస్పీ రాజేష్ చంద్ర..

కామారెడ్డి (విజయక్రాంతి): తన వివాహేతర సంబంధా నీకి అడ్డు వస్తున్నాడని భర్తను అంతమొందించేందుకు కుట్ర పన్నిన భార్యతో పాటు మరో ఐదుగురుని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) తెలిపారు. భర్తను సుపారీ ఇచ్చి హత్య చేసేందుకు కుట్ర పన్నిన భార్యను మిగతా ఐదుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు.

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిధిలోని ఫరీద్ పేట గ్రామ శివారులో మోటార్ సైకిల్ పై డ్యూటీకి వెళుతున్న ఘనపురం గ్రామానికి చెందిన సాడెం కుమార్ అనే యువకుడిని ఈనెల 21న ఇనుప రాడ్లతో దాడి చేసి హత్యయత్నం చేశారని తెలిపారు. బాధితుడు మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. కామారెడ్డి ఏఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. దర్యాప్తులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారించగా వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. నిందితుల్లో ఫిర్యాదుదారుడి భార్య సాడెం రేణుక కూడా ఉందన్నారు. తుది విచారణలో వివాహేతర సంబంధం నేపథ్యంలో రేణుక తన భర్త హత్యకు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు కాంపల్లి మహేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామ సమీపంలో లలితమ్మ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నారని తెలిపారు. అక్కడే ఘనపురం గ్రామానికి చెందిన సాడెం రేణుకతో పరిచయం ఏర్పడి క్రమంగా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది అన్నారు. రేణుక భర్త కుమార్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఇద్దరు కలిసి కుమార్ ను హత్య చేయాలని కుట్ర పన్నారని తెలిపారు. కుమార్ మరణించిన తర్వాత అతని  ఆస్థిని అనుభవించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కుట్రను అమలు చేయడానికి అల్వాల్ కు చెందిన మహమ్మద్ అశ్వక్, కు రూ15 లక్షలకు సుపారి ఒప్పించి అతని అనుచరులైన ముబీన్, అమీర్ ,అన్వర్ ,మోసిన్, లకు అడ్వాన్సుగా రెండు లక్షల రూపాయలు ఇచ్చారని తెలిపారు.

వారి పథకం ప్రకారం కుమార్ కార్యాలయానికి వెళ్లే మార్గాన్ని గుర్తించి మాచారెడ్డి మండల పరిధిలోని ఫరీద్ పేట గ్రామ సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద హత్యకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకున్నారని తెలిపారు. దీంతో ఈనెల 21న ఉదయం కాంపల్లి మహేష్ ,అశ్వక్ ,అతని అనుచరులు కుమారును వెంబడించి ఇన్ఫరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని తెలిపారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు రావడం గమనించిన నిందితులు అక్కడనుండి పరారయ్యారని తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు ,ఒక ఆటో, ఒక గొడ్డలి, రెండు ద్విచక్ర వాహనాలు ,నాలుగు మొబైల్ ఫోన్లు,స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా వారిని త్వరగా పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ కేసును సమర్థవంతంగా చేదించడంలో కృషిచేసిన కామారెడ్డి రూరల్ సీఐ ఎస్ రామన్ ,మాచారెడ్డి ఎస్ఐ వై అనిల్ ,క్రైమ్ టీం సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.