ఇద్దరు పిల్లలున్నా కనికరించని ఏఆర్ కానిస్టేబుల్
నల్లగొండ, జనవరి 22 (విజయక్రాంతి): ప్రియురాలితో కలిసి ఓ ఏఆర్ కానిస్టేబుల్ భార్యపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘ టన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో బుధవారం జరిగింది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం ఆచార్యులగూడేనికి చెందిన నాగమణికి మునగాల మండలం నేలమర్రికి చెందిన మొగిలి సైదులుకు 14 ఏండ్ల క్రితం వివాహమైంది.
వీరికి పదేండ్లలోపు ఇద్దరు కుమార్తెలున్నారు. సైదులు ఏఆర్ కానిస్టేబుల్‌గా కేతేపల్లిలో పనిచేస్తున్నాడు. తన అక్క కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకొని అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. గతంలో మునగాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు న మోదైంది.
మరోసారి తప్పుచేయనని భార్య ను నమ్మించి లోక్‌అదాలతో రాజీ చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి నకిరేకల్‌లో గది తీసుకొని ప్రియురాలితో ఉంటున్నాడు. బు ధవారం మధ్యాహ్నం ప్రియురాలితో గదిలో ఉండగా భార్య పట్టుకున్నది. ఇద్దరు ఆమెను చితకబాది వెళ్లిపోయారు. నాగమణి నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.