calender_icon.png 28 October, 2024 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లాలు.. ప్రియురాలు..

03-07-2024 12:05:00 AM

ఒకరేమో ఉత్తమమైన ఇల్లాలు. మరొ కరేమో మాజీ ప్రియురాలు. ఈ ఇద్దరికీ సంబంధించిన ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే హీరో వెంకటేష్. ఇదేదో ‘ఇంట్లో ఇల్లాలు.. వంటిట్లో ప్రియురాలు’లా అనిపిస్తుంది కదూ..! అయితే ఇల్లాలు.. ప్రియురాలు ఉన్న మాట నిజమే కానీ ఈ సారి కథ వేరే అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్‌అనిల్ రావిపూడి కలయికలో మూడో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్న ఈ సినిమా కోసం ఇద్దరు కథానాయికలను ఎంపిక చేసింది చిత్ర బృందం. వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమాలో ఉత్తమ ఇల్లాలిగా ఐశ్వర్య రాజేశ్ కనపడనుండగా, మీనాక్షి చౌదరి ఆయన మాజీ ప్రియురాలి పాత్ర పోషిస్తు న్నారు. వీరిద్దరికీ స్వాగతం పలుకుతూ వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు మేకర్స్. 2025 సంక్రాంతికి తెరమీదికి రాను న్న ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.