calender_icon.png 19 April, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా బడికి రండి.. బెనిఫిట్స్ పొందండి..

16-04-2025 06:40:07 PM

పెన్ పహాడ్ విద్యాశాఖ ఆద్వర్యంలో విస్తృత ప్రచారం..

పెన్ పహాడ్: కార్పోరేట్ పాఠశాలలను మైమరిపించే విధంగా తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కెజీబీవీ పాఠశాలలను తీసుకువచ్చి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మండల విద్యాశాఖ అధికారి నకరెకంటి రవి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రములో వచ్చే విద్యా సంవత్సరానికి గాను 'బడిబాట' కార్యక్రమాన్ని సంబందించి టీంలను ప్రారంభించి మాట్లాడారు.

'మా బడికి రండీ. ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్యతో పాటు బెనిఫిట్స్' పొందండి. అంటూ మండల విద్యాశాఖ ఆద్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థల మోజులో పడకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడగట్టిన కష్టార్జీతం దారపోయకుండా తమ పిల్లలను మా పాఠశాలలకు పంపించి నాణ్యమైన విద్యను మీ పిల్లలు సొంతం చేసుకునే విధంగా సహకరించాలని ఇంటింటి ప్రచారంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. అంతేకాదు ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించే బెనిఫిట్స్ మీ సొంతం చేసుకోవాలని కోరారు.

ఉచితంగా మేము అందించే బెనిఫిట్స్ ఇవే..

1. ఆంగ్ల, తెలుగు మాధ్యమంలో ఉచిత పాఠ్యపుస్తకాలు

2. ఉచిత నోట్ బుక్స్

3. ఉచిత రెండు జతల యూనిఫామ్స్

4. దూర ప్రాంత విద్యార్ధులకు రవాణ భత్యం

5. అనుభవం కలిగిన ఉపాధ్యాలతో నాణ్యమైన ఆంగ్ల, తెలుగు బోధన

6. పాఠ్య మరియు సహా పాఠ్య కార్యక్రమాలు

7. ఆటస్థలం, క్రీడా, శారీరక, వ్యాయాము ఉపాధ్యాయులు

8. డిజిటల్ విద్యాబోధన

9. అమెరికాలో చదువుతున్న విద్యార్థుల చేత ముఖాముఖీ కార్యక్రమం

10. ఆసక్తిని కలిగించే సైన్స్ ల్యాబ్ లు

11. సాంస్కృతిక కార్యక్రమాలు

12. మండల, జిల్లా స్థాయిలో ప్రతిభ పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులకు అండగా ఉంటామని పిల్లల బంగారు భవిష్యత్ కు చక్కటి బాట వేయడానికి పాలకులు, మేధావులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరుతూ విస్తత ప్రచారం నిర్వహించారు.