calender_icon.png 3 February, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామదాసు ధ్యాన మందిరానికి విస్తృత ప్రచారం

03-02-2025 12:48:33 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

ఖమ్మం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరానికి విస్తృత ప్రచారం కల్పించి, అందరూ గుర్తించేలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. భక్తరామదాసు జయంతోత్సవాల్లో భాగంగా ఆయన స్వగ్రామమైన నేలకొండపల్లిలోని ధ్యాన మందిరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్బంగా ధ్యాన మందిరంలో రామదాసు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రామదాసు ఆడిటోరియంలో జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భక్తరామదాసు శ్రీరాముడి కోసం అనేక కష్టాలు పడి భద్రాచలంలో రామాలయం నిర్మించారని అన్నారు. త్వరలోనే ప్రభుత్వం తరఫున రూ.2.65 కోట్ల నిధులు మంజూరు చేయించి, రామదాసు ధ్యాన మందిరాన్ని అభివృద్ధి చేయిస్తామన్నారు.