calender_icon.png 12 January, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరంగేట్రంలోనే 7 వికెట్లు..

22-07-2024 11:52:18 PM

 వన్డేల్లో స్కాట్లాండ్ బౌలర్ అరుదైన ఘనత

డుండీ: స్కాట్లాండ్ పేసర్ చార్లీ కాసెల్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ లీగ్‌రా టోర్నీలో సోమవారం ఒమన్‌తో మ్యాచ్‌లో చార్లీ కాసెల్ 21 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ తొమ్మిదేళ్ల రికార్డు బద్దలైంది.

2015లో రబాడ బంగ్లాదేశ్‌పై అరంగేట్రం మ్యాచ్‌లో 16 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆడుతున్న తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన 15వ బౌలర్‌గా నిలిచాడు. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ కాసెల్ దెబ్బకు 91 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం స్కాట్లాండ్ లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించి విజయాన్ని అందుకుంది.

వన్డేల్లో అరంగేట్రం మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన

చార్లీ కాసెల్ 7/21 (స్కాట్లాండ్)

కగిసో రబాడ 6/16 (దక్షిణాఫ్రికా)

ఫిడేల్ ఎడ్వర్డ్స్ 6/22 (వెస్టిండీస్)

జాన్ ఫ్రైలింక్ 5/13 (నమీబియా)

టోనీ డోడెమైడ్ 5/21 (ఆస్ట్రేలియా)