calender_icon.png 12 January, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకిన్‌సన్‌కు 7 వికెట్లు

11-07-2024 12:10:00 AM

ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టు 

లార్డ్స్: కెరీర్ చివరి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జిమ్మీ ఒక వికెట్ పడగొట్టి.. సుదీర్ఘ ఫార్మాట్‌లో తన వికెట్ల సంఖ్య 701కి పెంచుకున్నాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ ద్వారానే అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ పేసర్ అకిన్‌సన్ 7 వికెట్లతో సత్తాచాటడంతో.. విండీస్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లూయిస్ (27) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. అనంతరం బ్యాటర్లు అదరగొట్టడంతో ఇంగ్లండ్ అలవోకగా కరీబియన్ల స్కోరు అధిగమించింది.