రంజీల్లో అన్షుల్ రికార్డు
న్యూఢిల్లీ: హర్యానా పేస్ బౌలర్ అన్షుల్ కంబోజ్ రంజీల్లో అరుదైన ఫీట్ సాధించాడు. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన అన్షుల్ రికార్డులకెక్కాడు. రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా అన్షుల్ నిలిచాడు. గతంలో ప్రేమాన్షు ఛటర్జీ (1956లో అస్సాంతో మ్యాచ్‌లో), ప్రదీప్ సుందరం (1985లో విదర్భతో మ్యాచ్‌లో) ఈ ఫీట్ అందుకున్నారు.
మొత్తంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఆరో భారత బౌలర్‌గా కంబోజ్ రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల ప్రదర్శన ముగ్గురు మాత్రమే సాధించగా.. జాబితాలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేతో పాటు ఎజాజ్ పటేల్, జిమ్ లేకర్ ఉన్నారు.
అతడి ధాటికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు పరిమితమైంది. మిగిలిన మ్యాచ్‌ల్లో మహారాష్ట్ర, పంజాబ్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్ విజయాలు సాధించాయి. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 147 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.