calender_icon.png 30 November, 2024 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వకృత పోటీలు

29-11-2024 10:26:18 PM

విద్యార్థి దశ నుంచే మంచి లక్షణాలు అలవర్చుకోవాలి.. సిఐ రాజు వర్మ

చర్ల (విజయక్రాంతి): పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏమీ లేదని చర్ల సీఐ రాజు వర్మ అన్నారు. మీకోసం మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల వ్యాప్తంగా విద్యార్థులకు సామాజిక సేవ మానవత్వ విలువలు మన భాగస్వామ్యం అనే అంశంపై వకృత్వ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి మొత్తం పందొమ్మిది మంది విద్యార్థులు పాల్గొనగా ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఇవే కాక రెండు కన్సోలేషన్ బహుమతులు కూడా విద్యార్థులు సాధించారు, ప్రథమ బహుమతి త్యాగడ ప్రభుత్వ పాఠశాల, చర్ల గురుదేవ్ విద్యాలయం విద్యార్థులు సాధించారు.

ద్వితీయ బహుమతి త్యాగడ ప్రభుత్వ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల చర్ల విద్యార్థులు సాధించారు, తృతీయ బహుమతి రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం, సత్యనారాయణపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, కన్సోలేషన్ బహుమతులను వాణి విద్యానికేతన్, ప్రభుత్వ బాలికల పాఠశాల చర్ల  విద్యార్థులు సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చర్ల మండల సిఐ రాజు వర్మ, ఎస్సై నర్సిరెడ్డి, విశిష్ట అతిథిగా ఎండి ఓ.ఈదయ్య, ఎంఈఓ పరిటాల రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ రాజు వర్మ మాట్లాడుతూ.. అన్నిటికంటే గొప్పదానం విద్యాధానం అని అది అందించడం ఎంతో అదృష్టమని అదే విధంగా ఈ ప్రపంచంలో దొంగలించలేనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం విద్య మాత్రమేనని ప్రతి ఒక్కరూ చక్కగ చదువులు చదివి సివిల్స్ రాసి ఈ ప్రాంతం నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వంటి క్యాడర్లో ఉండాలని అటువంటి వారి కోసం నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని ఈ సందర్భంగా అన్నారు.

అనంతరం ఎండిఓ ఈదయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని తోటి వారికి సహాయం చేయడం ఈ దశ నుంచే అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీకోసం మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నీలి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి, రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు, పున్నం రామకృష్ణ, న్యాయా నిర్ణేతలుగా సీనియర్ పాత్రికేయులు దొడ్డ ప్రభుదాస్, జర్నలిస్ట్ జి.లక్ష్మణ్ కుమార్, కొంగురు నరసింహారావు రిటైర్డ్ టీచర్, మీకోసం మేమున్నాం స్వచ్ఛంద సేవ కమిటీ సభ్యులు అరవింద్, మురళి, గొట్టిపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.