calender_icon.png 31 January, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిషన్‌రెడ్డిపై కేసు ఎందుకు పెట్టలేదు?

31-01-2025 12:51:23 AM

* బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో అల్లు అర్జున్‌కు ఒక న్యాయం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఒక న్యాయమా? అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

గురువారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. హుస్సేన్‌సాగర్‌లో ‘భారతమాత మహా హారతి’ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోతే కిషన్‌రెడ్డి మీద కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను జైలుకు పంపిన విషయాన్ని గుర్తుచేశారు.

కిషన్‌రెడ్డి స్ఫూర్తితో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పర్మిషన్ తీసుకున్నారా? ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.