ఇటీవలి కాలంలో హిందువుల ఆచారాలను, నమ్మకాలను దెబ్బ తీసే చర్యలు ఎక్కువైనాయి. నగరంలో కొందరు దుండగులు దేవాలయాలపై దాడులు చేయడం శోచనీయం. సికింద్రబాదులో ముత్యాలమ్మ గుడిలో జరిగిన దారుణం తాజాగా ఈ పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇది ముమ్మాటికీ సహించరాని దుశ్చర్య. ప్రశాంతంగా ఉన్న నగరాన్ని అనవసరంగా ఇటువంటి విధ్వంసకర చర్యలతో రెచ్చగొట్టడం సమంజసం కాదు. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. హిందువుల మనోభావాలను కాపాడాలి.
శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్