calender_icon.png 20 October, 2024 | 3:08 AM

‘మూసీ’పై యూటర్న్ డ్రామాలెందుకు?

20-10-2024 12:47:22 AM

  1. కేటీఆర్ అక్కసులో అర్థం లేదు
  2. కేటీఆర్ ఆరోపణలను ఖండించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): మూసీనది పునరు జ్జీవంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణల్లో పస లేదని పంచాయతీ రా జ్ శాఖ మంత్రి సీతక్క శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. మూసీప్రాజెక్టును మొదట్లో వ్యతిరేకించిన కేటీఆర్, ఇప్పుడు ప్రజాగ్ర హానికి తలొగ్గి ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.

మూసీ డీపీఆర్ ఎప్పుడో సిద్ధం చేశామని చెబుతున్న కేటీఆర్, పదేళ్లు అధికారంలో ఉండి మూసీ నీటిని ఎందుకు శుద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. నిజం గా మూసీ ప్రక్షాళన పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఎలాంటి డీపీఆర్ లేకుండానే కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లను గోదారి పాలు చేసిన బీఆర్‌ఎస్ నేతలకు మూసీ డీపీఆర్ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేదని మండిపడ్డారు.