calender_icon.png 24 February, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనపై హడావిడి ఎందుకు

24-02-2025 12:00:00 AM

 మాజీ మంత్రి తలసాని 

చేర్యాల, ఫిబ్రవరి 23:  కులగనలపై ప్రభుత్వానికి హడావిడి ఎందుకని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన కుటుంబ సమేతంగా ఆదివారం కొమరవెల్లి మల్లన్న ను దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుల గణన పై ప్రభుత్వం ఎందుకు హడావిడి చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకోవాలని చూస్తుందన్నారు. ఇప్పుడు కావలసింది తీర్మానం కాదని చట్టం చేయాలని సూచించారు. గతంలోనే కెసిఆర్  ప్రభుత్వం తీర్మానం చేసి పార్లమెంటు పంపించిందని గుర్తు చేశారు.

మేడిగడ్డలో ఒక పిల్లర్ కూలిపోతేనే నానా రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్ ఎల్ బి సి టన్నెల్ కూలిపోయిన ఘటనలో 8 మృతికి ఇప్పుడేం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వ ఆయాంలోనే ఆలయం అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి పూర్తిగా అమలు కాలేదన్నారు. సబ్బండ వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నరు. రాబోయే కాలంలో 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నిక రావడం ఖాయం అన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఘన విజయం సాధించడం ఖాయం అన్నారు. ఆయన వెంట స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.