calender_icon.png 23 December, 2024 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల గణనపై వెనకడుగు ఎందుకు?

28-08-2024 12:00:00 AM

మన్నారం నాగరాజు :

స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా బీసీ ప్ర జలను కులాల వారీగా లెక్కించడానికి ఎం దుకో మన పాలకవర్గాలు వెనకడుగు వే స్తున్నాయి. ఓటు బ్యాంకు చీలుతుంది, అ గ్రవర్ణాలకు, పెట్టుబడుదారులకు రాజ్యాధికారం పోతుందన్న భయంతో బీసీ కులాల లెక్కలు తీయడానికి వెనుకంజ వేస్తున్నాయనేది నగ్నసత్యం.  ఈ దేశంలో పులులు, ఏనుగులు, జింకలు, పందులు, కుక్కలు, పిల్లులు, గొర్రెల లెక్కలు ఉంటాయి గాని బీసీ కులాల వారీగా లెక్కలు మాత్రం ఉం డవు. ఎన్నో కమిషన్లు వేసినా బీసీలు లెక్క లు తీయకపోవడం బాధాకరం.

బీసీలు ఎలా జీవిస్తున్నారు, వారి సామాజిక స్థితి ఎలా ఉంది,ఆర్ధిక నేపథ్యం ఏమిటి, విద్యారంగంలో జనాభా దామాషా ప్రకారం అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనే వి షయాలు కులం ద్వారానే బయట పడతాయని ప్రభుత్వాలు ఎందుకు తెలియదు? ఇంత ప్రాముఖ్యం కలిగిన ఈ అంశాన్ని గతంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు పట్టించుకోవ డం లేదు? కుల గణంకాలు లేకుండా నిర్ణయాలు తీసుకోలేం. సంక్షేమ పథకాలు, అ భివృద్ధి కార్యక్రమాలు కావచ్చు.. రిజర్వేష న్ శాతం కావచ్చు,  కుల గణాంకాలు ఉం టే సంబంధిత కులాల పరిస్థితులను బట్టి పేదవానికి రిజర్వేషన్‌లు అందే విధంగా ప్రభుత్వాలు చూడాలి.

 బ్రిటీష్ హయాంలోనే మొదలు

భారతదేశంలోని కులాల మధ్య సామాజిక విద్య, ఆర్థిక అంతరాలు, అంటరానితనాలను గమనించిన ఆ నాటి బ్రిటీష్ ప్రభుత్వం సమాజాభివృద్ధి కోసం కులగణన అవసరమని భావించి, 1872 నుంచి జనాభా లెక్కల తో పాటు కు ల గణననుకూడా చేపట్టింది. చివరి లెక్క లు 1931 లో తీశారు. కులాల వారీ సమాచారంతో అందరికీ విద్యాహక్కు చట్టాన్ని, ఇతర సంక్షేమ కార్యక్రమాలను, రిజర్వేషన్ల ను అమలు జరిపారు.

ప్రత్యేకంగా విద్య కోసం 1881 లో హంటర్ కమిషన్‌ను ని యమించారు. శూద్రులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు గానీ వాటివల్ల అగ్ర కులాలు మాత్రమే లబ్ధి పొందాయి. వీటన్నిటినీ మనువాది అయిన గాంధీజీ వ్యతి రేకించేవారు. మానవతా వాదులు సాహు మహారాజ్, మహాత్మ ఫూలే నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వరకు స్వాతంత్య్ర సం గ్రామంనుంచి అన్యాయానికి గురైన వారు వెనుక బడిన కులాలు వారు మాత్రమే.

బలపడుతున్న కులగణన డిమాండ్

 భారత రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చింది. స్వాతంత్య్రం తరువాత ఆ రు సార్లు తీసిన జనాభా గణనలో కులాలవారీ లెక్కలు తీయలేదు. కానీ ఈ సారి జరగబోయే జనాభా గణనలో కులాల వారీ లెక్కలు తీయాలనే డిమాండ్ బలం గా ముందుకు వస్తున్నది. అన్ని పార్టీలు, బీసీ సంఘాలు రాష్ర్ట ప్రభుత్వాలను డి మాండ్ చేస్తున్నాయి. ఈ దేశంలో కులమే అన్నింటినీ శాసిస్తుంది. రాజ్యాంగం కులా ల పేరు మీద ఎస్సీ, ఎసీ,్ట బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, అభివృద్ధి పథకాలు పెట్టాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాల పేరు మీద జనాభా గణన మొదటి నుంచి తీస్తున్నారు.

అలాగే లింగ విభజన పేరు మీద మహిళలు, వురుషుల జనాభా గణన ఉంది. కానీ బీసీ కులాల జనాభా వివరాలు కావాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నా, ప్రజా సం ఘాలు విజ్ఞప్తి చేసున్నా, హైకోర్టు ,సుప్రీంకోర్టులు ఆదేశిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ముందుకు రావడం లేదు.ఎందు కు చేపట్టడం లేదో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2021 లో దేశ జనగణన చేపట్టడానికి వివరాలకోసం 32 కాలమ్స్‌తో కూడిన నమూనా పత్రం విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ద్వారా జారీ చేసిన నమూనా పత్రంలో ఎస్సీ, ఎస్టీల వివరాలు,అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాల వివరాలు, ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్ ఉన్నాయి కానీ బీసీ కులాల వివరాలకు సంబంధించిన కాలమ్ పెట్టలేదు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు బీసీ కులాల అభివృద్ధికి విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేష న్లు ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధికి అనేక స్కీమ్‌లు అమలు చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయిస్తున్నాయి.అలాగే రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నారు. కానీ కుల గణన మాత్రం చేట్టడం లేదు.

స్థానిక ఎన్నికలకు అవసరం

 పంచాయతీ రాజ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీసీల జనాభా లెక్కలు అవసరం పడుతున్నాయి.దేశంలో బీసీ జనా భాలు లెక్క లు లేకపోవడం వల్ల రిజర్వేష న్ల శాతాన్ని నిర్ణయించడంలో కేంద్ర, రా ష్ర్ట ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నా యి.  గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ లను బీసీలకు కేటాయించాల్సిన బా ధ్యత కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలది. అలాగే బ డ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా బీసీల జనాభా లెక్కలు లేనందున అనేక స మస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కేం ద్ర ప్రభుత్వం రిజర్వేషన్లలో గ్రూవులు గా వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి చైర్మన్‌గా కమిటీ వేసింది. కులాల వారీగా జనా భా లెక్కలు లేకపోవడంతో ఈ కమిటీ వర్గీకర ణ చేసి ఏ గ్రూవునకు ఎంత శాతం నిర్ణ యించాలో తెలియక  ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.

మొక్కుబడి బీసీ కుల గణన

 1931లో అంటే 90 ఏళ్ల క్రితం బ్రిటీష్ ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్క లు సేకరించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభు త్వం బీసీ జనాభా లెక్కలు తీయడానికి ఊగిసలాడుతున్నది. బీసీ సంఘాలు అనేక వీధి పోరాటాలు, న్యాయ పోరాటాలు చేసి న తర్వాత స్పందించి 2010లో కులాల వారీ లెక్కలు తీయడానికి కేంద్రంలోని  కాంగ్రెస్  ప్రభుత్వం అంగీకరించింది. అ యితే అప్పటికే జనాభాలెక్కల ప్రక్రియ ప్రారంభమైంది. దీనితో ప్రత్యేకంగా బీసీ జనాభా లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభు త్వం ప్రత్యేకంగా వేల కోట్లు కేటాయించింది. బీసీ కులాల గణన పేరిట సాగిన ఈ లెక్కల సేకరణ బాధ్యతను బీజేపీ  కేం ద్ర ప్రభుత్వం మొక్కుబడిగా రాష్ర్ట ప్రభుత్వాలకు అప్పజెప్పింది.

దీంతో ఆయా రాష్ట్రాలు ఈ లెక్కలను నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి హామీ పథకం కూలీలు, అం గన్వాడీ టీచర్లు,  స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ద్వారా, ఎలాంటి బాధ్యత, జవాబు దారీ లేని వ్యక్తుల ద్వారా సేకరణ జరిపా యి. మొక్కుబడిగా సేకరించిన ఈ గణనలో వేల తప్పులు దొర్లాయి. ఈ లెక్కలతో సమగ్ర పట్టిక తయారు చేయడానికి మాజీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌తో ఒక కమిటీ వేశారు. కానీ ఆ తర్వాత వాటి వివరాలు, జనాభా సంఖ్య ఇంతవరకు ప్రక టించలేదు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ్ర అధికారంలో ఉండగా కులాల వారీ బీసీ జనగణన చేయాలని పార్లమెంట్‌లో బీజే పీ డిమాండ్ చేసింది.ఇప్పుడు బీజేపీ మూ డవసారి అధికారంలో ఉంది. కావున కు లాల వారీ లెక్కలు తీయవలసిన బాధ్యత ఆ పార్టీపై  ఉంది.

2018 లో అప్పటి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జరిపిన ఉన్నత స్థాయి సమావేశంలో జనాభా గణనలో బీసీ కులాల వారీ లెక్కలు చేయాలని నిర్ణ యం కూడా తీసుకున్నారు. రెండవసారి అధికారంలోకి రాగానే ఎందుకు మార్పు వచ్చింది? జనాభా లెక్కలు తీస్తే అణచివేతకు గురైన కులాల వారు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిస్తే వారు అన్ని రంగాలలో ముఖ్యంగా బడ్జెట్‌లో, అధికారంలో తమ వాటా తమకు ఇవ్వాలని అడుగుతా రేమోనని పాలక వర్గాలు భయపడుతున్నట్లు కనిపిస్తుంది.

రాజ్యాం గంలోని 15 (4) (5), 16(4) (5) ప్రకారం బీసీ కులాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టంగా ఉంది. రాజ్యాంగంలోని 243 డి(6) 243 టీ (6) ప్రకారం స్థానిక సంస్థల్లో  బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. జనాభా లెక్క లేకుండా రిజర్వే షన్ల శాతం ఎలా నిర్ణయిస్తారు? రాజ్యాంగంలోని 339 ప్రకారం జాతీయ బీసీ కమి షన్ ఏర్పాటు చేశారు. బీసీల విద్య, ఉ ద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి ఏ సి ఫార్సు చేయాలన్నా జనాభా లెక్కలు కా వాలి. రాజ్యాంగం కల్పించిన సదుపాయా లు, రక్షణలు, రిజర్వేషన్ల కోసం జనాభా లెక్కలు అవసరం. రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి న అనేక నిబంధనలు, ఆర్టికల్స్ ఉన్నాయి. 

 వ్యాసకర్త తెలంగాణ 

లోక్‌సత్తా పార్టీ, రాష్ర్ట అధ్యక్షుడు