సమంత ఇటీవలి కాలంలో ఎక్కువగా తన పెళ్లి, విడాకుల ప్రస్తావన తీసుకువస్తున్నారు. ఇటీవల తన మాజీ కోసం కొనుగోలు చేసిన ఖరీదైన గిఫ్ట్స్ గురించి ప్రస్తావించారు. తాజాగా తన విడాకుల గురించి మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్, తన వెడ్డింగ్ గౌన్ రీ మోడల్ చేయించడం వంటి విషయాలపై స్పందించారు. “డివోర్స్ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు సమాజం ‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్, ఆమె జీవితం వృథా’ వంటి ట్యాగ్స్ ఎందుకు తగిలిస్తుందో అర్థం కావడం లేదు.
కష్టాల్లో ఉన్న అమ్మాయిని ఇవి మరింత నిరాశకు గురి చెయ్యడమే కాకుండా ఆమె కుటుంబాన్ని సైతం అలాంటి ట్యాగ్స్ బాధిస్తాయి. నా గురించి ఎన్నో అబద్ధపు ప్రచారాలు జరిగాయి. అయితే వాటి గురించి మాట్లాడాలని నేనాడూ అనుకోలేదు. నా పెళ్లి గౌను రీమోడల్ చేయించాలని నిర్ణయించుకున్న ప్పుడు చాలా బాధపడ్డాను. పెళ్లి గౌను రీ డిజైన్ చేయించడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలనీ అనుకోలేదు. నా జీవితంలో జరిగిన విషయాలను దాచాలనుకోలేదు” అని సమంత తెలిపారు.