కథానాయిక అనన్య నాగళ్ల ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో షేర్ చేశారు. దానిలో ఆమె కొబ్బరి బొండాం నీళ్లను స్ట్రా లేకుండా తాగుతూ కనిపించారు. దానికి ఆమె “నేను సాధారణంగా స్టీల్ స్ట్రా వెంట తెచ్చుకుంటా కానీ అది లేకుంటే ఇలా నేరుగా తాగేస్తా. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం” అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వీడియోపై వస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. దీనిపై స్పందించిన అనన్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చెప్పాను. మీకు నచ్చితే చేయండి.. లేదంటే లేదు. ఎందుకింత నెగిటివిటీ” అంటూ మండిపడింది. ప్రస్తుతం అనన్య సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. అనన్య 2019లో ‘మల్లేశం’ చిత్రం లో తెరంగేట్రం చేసింది. వకీల్ సాబ్ చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అనన్య నటించిన ‘పొట్టేల్‘ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.