15-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలో తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సు లేఖలు ఎంతో ఉపయోగపడేవి. రాష్ట్ర విభజన తర్వాత 2019 వరకు లేఖలను అంగీకంచిన టీటీడీ.. క్రమం గా వాటిని స్వీకరించడం మానేసింది.
ఈ విషయమై మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ గతంలో తిరుమలలో బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సైతం టీటీడీ తీరును తీవ్రంగా ఖండించారు. మంత్రి కొండా సురేఖ సైతం ఏపీ సీఎంకు ఈ విషయమై లేఖ రాశారు. తాజా గా ఆ రాష్ట్రంలో టీడీపీతో కలిసి అధికారం పంచుకున్న బీజేపీకి చెందిన మెదక్ ఎంపీ రఘునందన్‌రావు టీటీడీ తీరుపై తిరుమల కేంద్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు టీటీడీ తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి. గతంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు 2024, ఫిబ్రవరి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు అంగీకరిస్తామని చెప్పినా.. నేటికీ పరిస్థితిలో మార్పు రాలేదు.
దీంతో మళ్లీ తెల ంగాణ సిఫార్సు లేఖల విషయంలో వివా దం తలెత్తింది. తమ లేఖలను అంగీకరించకపోతే తిరుపతికే వచ్చి తేల్చుకుం టామని బీజేపీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారంటే టీటీడీ వ్యవహరించిన తీరు అర్థం చేసుకోవచ్చని తెలంగాణ భక్తులు అంటున్నారు.