20-02-2025 01:15:52 AM
వాషింగ్టన్, ఫిబ్రవరి 19: భారత్‌లో ఎన్నికల ప్రక్రియ కోసం అమెరికా 21 మిలియన్ల యూఎస్ డాలర్లను వెచ్చిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిధుల కేటాయింపును రద్దు చేశారు. అపరకుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ సూచనల మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మేము భారత్‌కు ఇంత మొత్తంలో ఎందుకు డబ్బులివ్వాలి? అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
ప్రధాని మోదీ మీద తనకు అపారమైన గౌరవం ఉందంటూనే ట్రంప్ ఇలా నిధులను ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘భారత్‌కు ఎందుకు 21 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వాలి? వాళ్ల వద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే వాళ్లే మా మీద ఎక్కువ పన్నులు వేస్తున్నారు.
మాకు చాలా ఇబ్బంది అవుతోంది. నాకు భారత ప్రధాని అంటే చాలా గౌరవం ఉంది. ఓటర్ టర్నౌట్ కోసం ఇంత డబ్బు ఇస్తున్నామా?’ అని అన్నారు. ఈ విషయంపై ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వుల మీద కూడా సంతకం చేశారు. మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న డోజ్ అమెరికా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం కోసం అన్నింటా కోతలు పెడుతోంది.
భారత్‌లో రాజకీయ దుమారం
ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ నిర్ణయంపై బీజేపీ నాయకులు డోజ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేత నళిన్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘యూఎస్ ఏజెన్సీ ఇండియాలో ఎన్నికల కోసం 21 మిలియన్ డాలర్లు ఎందుకివ్వాలి? ప్రపంచంలో మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
మన దర్గర నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మనకు ఎలక్షన్ కమిషన్ ఉంది’ అన్నారు. అంతే కాకుండా ‘ఎన్నికలను ప్రభావితం చేయడం కోసం కేంబ్రిడ్జి ఎనలటికాతో జట్టుకడుతున్నా యి. గతంలో మనం ఇటువంటి రాజకీయ పార్టీలను చా లా చూశాం’. అన్నారు.
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖురేషీ కూడా ఈ ఆంశంపై స్పందించారు. ‘20 12లో శిక్షణ కోసం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్ట్రోరల్ సిస్టమ్స్‌తో ఒక ఒప్పందం కు దుర్చుకున్నాం. కా నీ దీనికి ఎటువంటి నిధులు అవసరం లేదు’. అన్నారు.
బయటి వ్యక్తుల జోక్యం
అమెరికా 21 మిలియన్ డాలర్ల నిధులపై బీజేపీ అమిత్ మాలవీయ స్పందించారు. ‘ఓటర్ టర్నౌవుట్ కొరకు 21 మిలియన్ అమెరికన్ డాలర్లా? భారత ఎన్నికలపై బయటి వారి జోక్యాన్ని ఇది ఎత్తి చూపుతోంది. దీని వల్ల ఎవరు లాభపడుతున్నారు. రూలింగ్ పార్టీ అయితే ఖచ్చితంగా కాదు’ అని మాలవీయ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మీద ఆయన పలు ఆరోపణలు చేశారు. విదేశీ శక్తులతో కలిసి కాంగ్రెస్ దేశాన్ని బలహీనపరచాలని చూస్తోందని ఆరోపించారు.
మోదీ ఏదో చెప్పబోయారు కానీ..
రెసిప్రోకల్ టారిఫ్స్ విషయంలో ట్రంప్ మరోమారు స్పందించారు. డోజ్ అధినేత మస్క్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోదీతో జరిగిన భేటీకి సంబంధించిన విషయాలను వెల్లడించారు. ‘మోదీతో సమావేశం అయినపుడు మనం పరస్పర పన్నుల గు రించి మాట్లాడుకోబోతున్నాం.
మీరు ఎంత పన్నులు వే స్తే నేను కూడా అంతే మొత్తంలో చార్జ్ చేస్తా’. అని అన్నట్లు ఆనాటి సంభాషణను గురించి వివరించారు. అలా చెప్పగానే ప్రధాని మోదీ ‘లేదు.. లేదు.. నాకు నచ్చలేదు’ అన్నారు. అయితే ‘లేదు.. లేదు మీరెంత చార్జి వి ధిస్తే నేను అంతే వేస్తాను.
నేను అన్ని దేశాలకు అదే వర్తింపజేస్తున్నాను’. అని తను అన్నట్లు ట్రంప్ వివరించారు. ఎక్కువగా పన్నులు వేసే దేశాల జాబితాలో భారత్ మొ దటి వరుసలో ఉంటుంది. ఆటోమొబైల్ సెక్టార్ ఉత్పత్తు ల మీద భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోందని ట్రం ప్ అనగా... పక్కనే ఉన్న మస్క్ దానిని సమర్థించారు.