calender_icon.png 23 October, 2024 | 3:55 AM

పేకాడేందుకు అనుమతివ్వాలా?

23-10-2024 02:20:18 AM

పిటిషనర్ క్లబ్‌లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

అమరావతి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): క్లబ్‌లో 13 ముక్కల పేకాట ఆ డుకునేందుకు అనుమతి కోరిన ఓ క్లబ్ యాజమాన్యంపై ఏపీ హైకోర్టు మండిపడింది. తమ క్లబ్‌లో 13 కా ర్డుల రమ్మీ ఆడుతుంటే పోలీసులు జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

రెండు వారాలపాటు పేకాట ఆడుకుంటే వచ్చే నష్టమేమీ లేదని అనడంపై అసహనాన్ని వ్యక్తంచేసింది. పేకాట ఆడకపోతే మిన్ను విరిగి మీద పడదని వ్యాఖ్యానించింది. కనీసం రెం డు వారాలపాటు పేకాట ఆగినా పలు కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చెప్పింది.

పిటిషనర్ క్లబ్ కోరిన ట్టు అనుమతిస్తే పేకాటను కోర్టులే ప్రోత్సహిస్తున్నాయనే అభిప్రాయానికి ప్రజలు వస్తారని వ్యాఖ్యానించింది. పిటిషనర్ క్లబ్‌లో పేకాట వివరాలు అందజేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు.. విచారణను 2 వారాల కు వాయిదా వేసింది.

ఈ మేరకు జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి మంగళవారం ఆదేశాలిచ్చా రు. తమ క్లబ్‌లో రమ్మీ ఆడుతుం టే పోలీసులు అడ్డుకుంటున్నారంటూ గుంటూరు ఎల్వీఆర్ క్లబ్, ఏలూరులోని కాస్మోపాలిటన్ క్లబ్ వేసిన పిటి షన్ల విచారణ సందర్భంగా హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. వాస్తవా లు తెలుసుకోకుండా ఏవిధమైన మ ధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది.