calender_icon.png 21 January, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలు ఓట్లు ఎందుకెయ్యాలి?

03-10-2024 12:00:00 AM

ప్రస్తుతం రాష్ట్రం స్థానిక సంస్థల ఎ న్నికల సమస్యను ఎదుర్కొంటుంది. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై తీ వ్ర ప్రభావమే చూపుతాయి. ఈ కీలక సమయంలో రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు తమ ప్రయో జనాలను కాపాడే పార్టీకే ఓటు వేయవలసింది ఉంటుంది.  రాజ్యాంగ రచ న కాలం నుంచి కాంగ్రెస్ బీసీలకు అ న్యాయమే చేసింది.

389 రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో అత్యధికులు కాం గ్రెస్ వారే. దేశంలో, ఉమ్మడి రాష్ట్రం లో అత్యధికంగా పరిపాలన కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రస్తు తం తెలంగాణ రాష్ట్రంలో కూడా కాం గ్రెస్ ప్రభుత్వమే ఉంది. కాబట్టి రా జ్యాంగంలో, దేశంలో, రాష్ట్రంలో బీసీలకు జరిగిన అన్యాయానికి ఆ పార్టీ పూర్తి బాధ్యత వహించాలి. 

బీసీల ప్రయోజనాల కోసం మొరా ర్జీ దేశాయ్ ప్రధానిగా ఉండగా బీపీ మండల్ కమిషన్ ను ఏర్పాటు చేయ గా, ఆ కమిషన్ 1980 లో తన నివేదికను ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండ గా సమర్పించింది. దానిని ఆమెగాని, ఆమె అనంతరం పదవిలోకి వచ్చిన రాజీవ్ గాంధీ గాని ఆ నివేదికను ప ట్టించుకోలేదు. పది సంవత్సరాలు మూల పడి ఉన్న ఈ నివేదికను వీపీ సింగ్ ప్రధానిగా వచ్చాక మాత్రమే వె లికి తీశారు.

బీసీలకు రాష్ట్రంలో అనంతరామన్ కమిషన్ ఆధారంగా ప్రభు త్వమిచ్చిన జీవో మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత పుంజాల శివశంకర్ పుణ్యానస్వరాజ్యం వచ్చిన 25 సంవత్సరాలకు రాష్ట్రంలోని బీసీలకు విద్య ,ఉద్యోగ రంగాలలో కేవలం 25 శాతం రిజర్వేషన్స్ 1972 నుంచి మా త్రమే లభిస్తున్నాయి.

అలాగే మండల కమిషన్ రిపోర్ట్ పై 1992 లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాత్రమే ఓబీసీల కు కేవలం 27 శాతం రిజర్వేషన్స్ వి ద్యా, ఉద్యోగాలలో లభిస్తున్నాయి. అ ది కూడా 50 శాతం సీలింగ్,క్రీమీలేయర్ లాంటి షరతులతో. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ హయాంలో ము స్లింలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు నాలుగు శాతం నుంచి 12శాతం పెంచే బిల్లు ఆమోదింప చేసుకున్నారు.

మై నారిటీ రిజర్వేషన్లకు, మహిళా రిజర్వేషన్లకు, అగ్రకుల వెనుకబడిన వారికి రి జర్వేషన్ల బిల్లుల విషయంలో అన్ని రాజకీయ పార్టీలకు ఎలాంటి అభ్యంత రం లేనప్పుడు, బీసీల విషయం వచ్చేసరికి మాత్రం వివక్ష చూపడం ఆయా పార్టీల నిరంకుశత్వానికి నిలువెత్తు నిదర్శనం. బీసీ నాయకులమంటూ బీసీ కార్డు ఉపయోగించుకుంటున్న ఏ నా యకుడు కూడా ఈ అంశాలలో నిరసన తెలియజేస్తూ తమ పదవికి రా జీనామా చేయలేదు.

కనీసం ఈ చర్యలుఅన్యాయమని ఖండించిన బీసీ నా యకులు లేరు. ఇంతటి అన్యాయం చే స్తున్న బీసీలు తమకు ఎందుకు ఓట్లు వేయాలో ఆయా పార్టీ బీసీ నాయకు లు సమాధానం చెప్పాలి. 2023 అ సెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ భాగంగా స్థానిక సంస్థలలో బీసీ కమిషన్ ద్వారా కులగణన జరిపి 42 శాతం పెంచడంతో పాటు, స్థానిక సంస్థలలో ఏబీసీడీ వర్గీకరణ ప ద్ధతి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిం ది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నె లలు గడుస్తున్నా కామారెడ్డి డిక్లరేషన్ మాటే లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి మనసుంటే మార్గాలనేకం. గత కమిషన్ల సర్వేలు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీలకు కనీసం స్థానిక సంస్థ ల్లోనైనా హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ 42 శాతం కోటాను కల్పిస్తే బాగుంటుంది. 

 అశోక్ యాదవ్ పంచిక