29-04-2025 12:56:45 AM
హనుమకొండ, ఏప్రిల్ 28 (విజయక్రాంతి)/గజ్వేల్/అశ్వారావు పేట: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్ నాయకులకు దుఃఖం వస్తోందని, ధనిక రాష్ట్రం గా సోనియాగాంధీ తెలంగాణను ఇస్తే రూ.8.19లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా బీఆర్‌ఎస్ మార్చివేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.
గత ప్రభుత్వం అర్ధరాత్రి దొరవారి కుటుంబసభ్యు లు, అనుచరులకు ఉపయోగపడే విధంగా ధరణి చట్టాన్ని రూపొందిస్తే ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం తరతరాలుగా తాత లు, ముత్తాతలు నుంచి ఏ భూమినైతే సాగు చేసుకుంటూ ఉన్నారో వారికి హక్కు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం మంత్రి పొంగులేటి హనుమకొండ, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలువు రు మంత్రులతో కలిసి భూభారతి అవగాహన సదస్సులకు హాజరయ్యారు.
భూభారతితో భూభద్రత..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగు లేటి మాట్లాడుతూ.. రైతుబంధు కోసం ఆనాటి ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టంలో దరఖాస్తు చేసుకున్న 9.26లక్షల మంది రైతుల దరఖాస్తులకు ఎటువంటి పరిష్కారం చూపలేదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5.45 లక్షల దరఖాస్తులకు పరిష్కారం చూపమన్నారు.
రాష్ట్రంలో పైల ట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో వచ్చిన దరఖాస్తులను జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పరిష్కరిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుజాతనగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు.అశ్వరావుపేట నియోజకవర్గంలో 911, 152 సర్వే నెంబర్లలో ఇబ్బందులు ఉన్నాయని గత రివ్యూ మీటింగ్ లో స్థానిక శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని పరిష్కరించామని, అవి త్వరలోనే ప్రజలకు అందుతాయని తెలిపారు.
కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ, కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో మధు, హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లోనే మానిటరింగ్..
గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని భూభారతి చట్టం ద్వారా రైతులకు న్యాయం జరగాలంటే ఆన్‌లైన్ మానిటరింగ్ ఉండాలని మంత్రి పొంగులేటి సూచించా రు. రైతులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని, ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టం రూ పొందించాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మం డల కేంద్రం లోని ఎంఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి పా ల్గొన్నారు.
ఈసందర్భంగా రెవెన్యూ మంత్రు లు పొంగులేటి, పొన్నం మాట్లాడుతూ.. భూభారతి ద్వారా రైతులకు మెరుగైన సేవ లు అందించడానికి, భూ రికార్డుల్లో జరిగిన తప్పులను సవరించడానికి అవకాశం లభించిదని అన్నారు. అనంతరం స్వయం మహి ళా స్వయం సహాయక సంఘాలకు రూ. 2కోట్ల 50 లక్షల చెక్కు అందజేశారు.
ధరణిని బంగాళాఖాతంలో వేశాం..
ప్రజల భూముల కష్టాలు తీర్చడానికి తెచ్చిన భూభారతి చట్టం వెనకాల అందరి కృషి, ఆలోచన ఉందని, ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు ధరణిని బంగాళాఖాతంలో వేశామని రెవెన్యూ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. సోమవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శాకారంలో భూభారతి చట్టం ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
కార్యక్రమం లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి పొంగులేటి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ..డబుల్ బెడ్‌రూంలు రాష్ట్రంలో అసంపూర్తి స్థాయిలోనే ఉన్నాయని, కేసీఆర్ పుట్టిన ఊరు చింతమడకలో కూడా ఇండ్లు కట్టలేదని, సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో కూడా డబుల్ బెడ్‌రూం ఇండ్లు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు.
సొంత పనులు చేయలేదనే వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేశారని ఆరోపించారు. సదస్సులో కలెక్టర్ మను చౌదరి, డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, అమీద్, ఆర్డీవో చంద్రకళ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్, కొండపాక మార్కెట్ కమిటీల చైర్మన్‌లు వంటేరు నరేందర్‌రెడ్డి, బాగనోళ్ల విజ య మోహన్, విరూపాక శ్రీనివాస్‌రెడ్డి, గజ్వే ల్ ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూం రెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి పాల్గొన్నారు.