calender_icon.png 10 January, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎందుకీ రాద్ధాంతం

13-09-2024 12:00:00 AM

పార్టీ ఫిరాయంపులపై రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం గాడి తప్పుతోంది. ఇది చివరికి వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తోంది. బీఆర్‌ఎస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతామంటే అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు ఆయనను ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నారు. చివరికి ఈ వ్యవహారం ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్టులదాకా వెళ్లింది. వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున, న్యాయస్థానం తీర్పు వెలువడేదాకానో, లేదా, స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకానో ఇరుపక్షాల నేతలు వేచి చూస్తే మంచింది.

ఇలా సంయమనం కోల్పోయి వీధికెక్కడం వల్ల ఎవరికీ లాభం ఉండదు. ముఖ్యంగా అధికార పార్టీ మరింత బాధ్యతగా వ్యవహరించాలి.  ఇలాంటి గొడవల వల్ల రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం దెబ్బ తినడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రాష్ట్రప్రజలను ఆదుకోవడంలో రెండు పార్టీల నేతలు పోటీ పడితే అందరూ హర్షిస్తారు.

 శ్రేష్ఠి శేషగిరి, సికిందరాబాద్