calender_icon.png 10 April, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లుపై రాజకీయాలెందుకు?

03-04-2025 12:00:00 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

ముషీరాబాద్, ఏప్రిల్ 2: (విజయక్రాంతి): బీసీ బిల్లుపై రాజకీయాలు ఎందు కని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రాండ్స్‌లో ఏర్పాటుచేసిన  మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం న్యాయ నిపుణులతో చర్చించి బీసీ బిల్లు అమలు చేయడంతో భిన్నాభిప్రాయా లు వ్యక్తం అవుతున్నందున లోతుగా చర్చించి అమలు కోసం పగడ్బందీగా చర్య లు తీసుకోవాలని సూచించారు.

ఇందులో రెండు బిల్లులు ఉన్నాయని, ఒక బిల్లుకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు శాతం నిర్ణయించే అధికారం రాజ్యంలోని 246 ౄ6 ప్రకారం రాష్ట్రానికి ఇచ్చారన్నారు. జనాభా లెక్కలు అసెంబ్లీ బిల్లు ఉన్నందున దీనికి డోకా లేదని, వెంటనే అమలు చేయవచ్చన్నారు. ఇంకా విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగ సవరణ అవకాశం పడవచ్చని, ఇలా రెండు బిల్లులుపై భిన్నభిప్రాయాలు ఉన్నందున దీనిపై నిపుణులతో చర్చించాలని కోరారు.

తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఇంతవరకు గవర్నర్ ఆమోదం పొందలేదు దానిపై ప్రభుత్వం జీవో విడుదల చేయలేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రానికి పంపకుండానే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని చెప్పడం, కేంద్రంపై చలో ఢిల్లీ కార్యక్రమాలు పెట్టడం అనేది బీసీలను మోసం చేయడమేనన్నారు.

రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వారి వారి పరిధిలోని అధికారం ఉపయోగించి బీసీల సంక్షేమానికి ఉపయోగపడే బీసీ రిజర్వేషన్ బిల్లుని ఆమోదించాలని, అమల్లోకి వచ్చేట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.