calender_icon.png 28 September, 2024 | 1:02 PM

లడ్డూ కేసు సీబీఐకి ఎందుకొద్దు?

26-09-2024 02:43:53 AM

ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఆరోపణలు

విపక్షాలు, జగన్ డిమాండ్ చేస్తున్నా.. చంద్రబాబు సిట్‌వైపే వెళ్లడంపై అనుమానాలు!

ల్యాబ్ రిపోర్టులున్నా అరెస్టులు ఎందుకు చేయట్లేదని ప్రశ్నలు

విజయవాడ, సెప్టెంబర్ 25: తిరుమల లడ్డూ వివాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా చాలామంది హిందు వులను బాధించింది. ల్యాబ్ నివేదికలో వెల్లడైన అంశాలతో తిరుమల ప్రసాదంపై కొత్త అనుమానాలు వెలుగులోకి వచ్చాయి.

కాగా, ఈ అంశంపై విపక్ష నేత, మాజీ సీఎం జగన్ సైతం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీసీసీ మాజీ అధ్య క్షుడు గిడుగు రుద్రరాజు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ, లడ్డూ అంశం లో అధికార టీడీపీ ప్రభుత్వం మాత్రం ప్రత్యే క దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

దీనికి ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం గుంటూర్ రేంజ్ ఐజీపీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి నేతృత్వం వహించనున్నారు. త్రిపాఠితో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు గోపినాథ్‌శెట్టి, హర్షవర్ధన్‌రాజును ఈ బృందంలో భాగం చేశారు.

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగానికి దారితీసిన పరిస్థితులు, గత ఐదేళ్లలో జరిగిన ఇతర అక్ర మాలపైనా సిట్ విచారణ జరుపుతుందని ఓ అధికారి తెలిపారు. 

సీబీఐ బదులు సిట్‌కు ఎందుకు?

సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, తిరుమలను ప్రక్షాళన చేసి ఆలయానికి పూర్వవైభవాన్ని తీసు కొస్తామని సిట్‌పై ప్రకటన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చా రు. అయితే, విపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నా సిట్‌కు ఎందుకు అప్పగించారనే ప్రశ్నలు లేవనెత్తున్నారు.

సిట్ లేదా సీఐడీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తాయని, అందువల్ల వీటి విచారణ చంద్ర బాబు అభిప్రాయాలకు అనుగుణంగా సాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కల్తీకి కారణమైనవారిపై ఆరోపణలు తప్ప ఇప్పటివరకు ఎలాంటి కేసులు పెట్టలేదు.

ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా డెయిరీ యజమానులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నెయ్యికి ఆమోదం తెలిపిన అధికా రులపై ఇప్పటికే చర్యలు తీసుకునేవారని చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. ల్యాబ్ రిపోర్టుల్లో జంతు వుల కొవ్వు వాడినట్లు నిగ్గు తేలాక కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నలు వస్తున్నాయి.

అరెస్టులేవీ?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ కల్తీ జరిగిందని టీడీపీ ప్రభు త్వం ఆరోపిస్తోంది. అయితే సమయంలో సీఎంగా ఉన్న జగన్ సీబీఐ దర్యాప్తు కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సిట్ ఏర్పాటుపైనే ఎందుకు ఆధారపడ్డారని ఆరోపిస్తున్నారు.

సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు సంకోచిస్తున్నారు? ఆయన ఆరోపణలతోనే ఈ లడ్డూ వివాదం మొదలైంది. దీంతో అరెస్టులు, సీబీఐ విచారణ లేకుండా ఈ ఆరోపణలను ఎక్కువ కాలం కొనసాగించలేరనే సందేహాలు వినిపిస్తు న్నాయి. ఈ వ్యవహారం చుట్టూ తిరిగి టీడీపీకే దెబ్బ కొట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.