calender_icon.png 1 October, 2024 | 8:00 AM

‘1962’ అంబులెన్స్‌పై నిర్లక్ష్యమెందుకు?

01-10-2024 01:46:14 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో అంబులెన్స్ సేవల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆరు నెలలుగా వేతనాలు అందించకపోవడంతో సిబ్బంది అనేక అవస్థలు పడుతున్నారని సోమవారం ఎక్స్‌వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. మూగ జీవాల వద్దకే సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకు కేసీఆర్ ప్రారంభించిన 1962 పశువైద్య సం చార వాహన సేవలను కాంగ్రెస్ ప్రభు త్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 1962 వాహనాల్లో మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాల ని, ఉద్యోగ సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.