కేఎస్ నారాయణ :
కుల పరంగా ప్రభుత్వాలు అమలు జరిపే రిజర్వేషన్ విధానం ఒక చిన్న వెసులుబాటు మాత్రమే. ఉన్నత విద్య, ఉద్యోగాల విషయంలో ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. కానీ, సమాజంలోని మిగిలిన వర్గాలతోపాటు ముదిరాజులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ‘స్వావలంబన’ సాధించడానికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం’ ఎంత ఎక్కువ మోతాదులో ఉంటే ప్రభుత్వం రూపొందించే విధి విధానాలలోనూ, అమలు జరిపే పథకాలలోనూ, వనరుల పంపిణీలోనూ, అందివచ్చే అవకాశాలలోనూ ప్రాధాన్యత, ప్రయోజనాలు అంత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి.
‘కులం ప్రధానంగా ఆధార పడిన ఒక జాతి నాలుగు తరాలపా టు ఆత్మగౌరవంతో నిలబడాలంటే ఆ కులానికి ఉపాధిని అందించే ప్రత్యేకమైన ‘వృత్తి, సామాజికంగా ఆ సమూహాన్ని ఐక్యంగా నిలబెట్టగలిగే సంస్కృతి’ రాజకీయంగా స్వావలంబనను అందించే రాజ్యాధికారం లో భాగస్వామ్యాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ మూడు అంశాలకు సంబంధించిన బలాబలాల మీదే ఆ కులానికి సమాజం నుండి లభించే విశ్వసనీయత, గౌరవ మర్యాదలు ఆధారపడి ఉం టాయి. వీటి ఆధారంగానే సదరు కులానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలలో తన కంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర నిర్వహించేందుకు అవకాశాలు లభిస్తాయి. ఇవన్నీ జర గాలంటే అంతిమంగా ఆ కులానికి లేదా జాతికి విశ్వసనీయమైన, బలమైన, నిజాయితీ, నిబద్ధత కలిగిన, నిస్వార్థమైన నాయ కత్వం తప్పనిసరిగా ఉండి తీరాలి.
3 ఆగస్టు 2013 నాడు సికింద్రాబాద్‌లోని ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ ర్స్’ కార్యాలయంలో ‘ముదిరాజ్ అధ్యయన వేదిక’ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహక సమావేశం రూపొందే నాటికి భావ సారూప్యత కలిగిన కొంతమంది ‘ముదిరాజ్ మిత్రులు’ కలిసి పై అంశాలపైనా, అప్పుడున్న పరిస్థితుల మీదా, వాటికి కారణమైన గతకాలపు అనుభవాలమీద, భవి ష్యత్తు అంచనాలమీద లోతైన విశ్లేషణ జరిపారు. పైన పేర్కొన్న లక్షణాలున్న సమర్థవం తమైన నాయకత్వం లేకపోవడమే ఇవాళ ముదిరాజ్ సమాజం ఎదుర్కొంటున్న అనే క సమస్యలకు మూలకారణంగా కనిపించిం ది.
నాయకత్వంలో కనీస ప్రజాస్వామిక విలువలు లేకపోవడం, కేంద్రీకృతమైన నియంతృత్వ విధానాలు వేళ్లూనుకోవడం, సంఘ నిర్మాణంలోనూ, కార్యక్రమాల (ఏమైనా ఉంటే) నిర్వహణలోనూ పారదర్శక త, జవాబుదారీతనం లోపించడం, జాతి సమస్యలమీద కనీస అవగాహన, పరిజ్ఞానం, అధ్యయనం లేకపోవడం, ఆ సమ స్యల పరిష్కారానికి అవసరమైన సమిష్టి ఆలోచన, ఉమ్మడి కార్యాచరణకు ఆస్కారం లేకపోవడం, జాతి(కులం) సమస్యల పరిష్కారం కంటే వ్యక్తి (నాయకుని) ప్రయోజ నాలే ప్రధానం కావడం.. లాంటి ఇంకా అనేక అవలక్షణాలవల్ల గడచిన పది సంవత్సరాలుగా ముదిరాజ్ జాతి తెలంగాణ (ఆంధ్రప్రదేశ్ సహా) లో కనీసం తన ఉనికిని కూడా నిలబెట్టుకోలేకపోయింది.
ఒక చారిత్రక ఘటన
రాష్ట్రంలో ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు ముదిరాజ్ (చారిత్రకంగా ముదిరాజ్, తెనుగోల్లు, ము త్తరాశి, బంటు తదితర పేర్లతో వ్యవహరిస్తున్నప్పటికీ) కులాన్ని రిజర్వేషన్ కేటగిరీలో బిసి- గ్రూప్‌లోకి మార్చుకోవడమే పరిష్కారమనే ఆశలు రేకెత్తించడం ముదిరాజ్ కుల నాయకత్వం చేసిన చారిత్రక తప్పిదంగా చెప్పక తప్పదు. కుల పరంగా ప్రభు త్వాలు అమలు జరిపే రిజర్వేషన్ విధానం ఒక చిన్న వెసులుబాటు మాత్రమే. ఉన్నత విద్య, ఉద్యోగాల విషయంలో మాత్రమే ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. కానీ, సమాజంలోని మిగిలిన వర్గాలతోపాటు ముదిరాజులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ‘స్వావలంబన’ సాధించడానికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం’ ఎంత ఎక్కువ మోతాదులో ఉంటే ప్రభుత్వం రూపొందించే విధి విధానాలలోనూ, అమ లు జరిపే పథకాలలోనూ, వనరుల పంపిణీలోనూ, అందివచ్చే అవకాశాలలోనూ ప్రాధాన్యత, ప్రయోజనాలు అంత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి.
డిసెంబర్ 20, 2003నాడు ‘జింఖానా గ్రౌండ్’ (సికింద్రాబాద్)లో ‘ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ముదిరాజ్ ప్రభంజనం’ ఒక అద్భుతమైన చారిత్రక సంఘటనగా, బ్ర హ్మాండమైన జాతి ఐక్యతా ప్రదర్శనగా, అన్నింటికీ మించి ముదిరాజుల ఆత్మగౌరవ ప్రతీకగా ప్రతి ఒక్కరూ, బేషరతుగా అంగీకరించక తప్పదు. కానీ, అశేషమైన ముది రాజ్ ప్రజల భాగస్వామ్యంతో, అత్యద్భుతంగా జరిగిన ‘ముదిరాజ్ ప్రభంజనం’ ఈ జాతి చరిత్రలో నమోదు చేయదగినరీతిలో సాధించిన విజయమేమిటో ఇప్పటికీ తేలని వాస్తవమే! ‘ముదిరాజ్ ప్రభంజనం’ నిర్వహించుకున్న తర్వాత 2004, 2009, 2014లలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో మన జాతి‘నేత’కు ఏ పార్టీనుండి కనీసం ‘టికెట్’ కూడా రాలేదు.
ఈ ఎన్నికల్లో కేవలం ‘ఇద్దరు’ (టీఆర్‌ఎస్ నుండి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుండి నారాయణరావు) మాత్రమే గెలుపొందారు. (ఇదీ ముదిరాజ్ ప్రభంజనం సాధించిన రాజకీయ చైతన్యం!?) 2009 ఎన్నికల్లో ముగ్గురు శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తే, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ‘ఒకే ఒక్క రు’ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. 1957 నుండి 2014 వరకు 13 సార్లు జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో అత్యధి కంగా ముదిరాజుల నుండి ‘ఐదుగురు’ ప్రతినిధులు అసెంబ్లీకి ఎన్నిక కావడం ఒక్కటే ఇప్పటి వరకూ గుర్తుంచుకోదగిన గర్వకారణం. గడచిన 62- సం వత్సరాల భారతదేశ పార్లమెంటు చరిత్రలో ముదిరాజుల నుండి కేవలం ‘ఒక్కరు (హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుండి కె.ఎస్. నారాయణ) మాత్రమే ప్రాతినిధ్యం వహించారు.
గడచిన 58 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముదిరాజుల మహిళా ప్రతి నిధిగా ‘ఒకే ఒక్కరు’ (కేవల్ ఆనందాదేవి, మెదక్ జిల్లా మెదక్ అసెంబ్లీ నియోజ క వర్గం నుండి 1962లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా) అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఒక కుల సంఘానికి నాయకత్వం వహించే నాయకులు తమ కుల ప్రతినిధులకు రాజకీయ భాగస్వా మ్యం దక్కాలంటే అన్ని రాజకీయ పార్టీలతో స్నేహ సంబంధాలను కొనసాగించాలి. ఏ ఒక్క పార్టీకో తొత్తులుగా మారకూడదు. ఎన్నికల సమయంలో తమ కుల సమూహాన్ని ఐక్యం చేసి, ఒక సంఘటితమైన శక్తిగా రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించాలి.
కుల బలాన్ని చూపించి, ఓట్ల సంఖ్యను లెక్క చూపి గ్రామ పంచాయితీ స్థాయినుండి పార్లమెంటుదాకా కుల సంఘాన్ని రాజకీయపార్టీగా మార్చి, అన్ని పార్టీలతో శత్రువైఖరిని ప్రదర్శిస్తే, ఇతర పార్టీలలో నిజాయితీగా, ఎంతో కాలంగా పనిచేస్తున్న ముదిరాజ్ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుల్లో నైతిక మద్దతు కరువవుతుంది. 2003లో ‘ముదిరాజ్ ప్రభంజనం’ తర్వాత జరిగిన 2004, 2009, 2014 ఎన్నికల సందర్భాలలో అన్ని పార్టీలలో ఎదిగిన ముదిరాజ్ నాయకులకు ‘కులబలం’ తోడు కాలేదు. ముదిరాజుల నుండి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ మొదటి ఆర్థికమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తే కనీసం అభినందించాల్సిన బాధ్య త కుల సంఘానికి తిరుగులేని నాయకులమని చెప్పుకునే వారికి ఉండదా! ఒక ముదిరాజు మంత్రి అయితే, అది ముదిరాజులకు దక్కిన అరుదైన గౌరవంగా భావించవలసిన అవసరం లేదా?
పల్లెబోయిన అశోక్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ ముదిరాజ్ మహాసభ
(తరువాయి వచ్చేవారం)