calender_icon.png 25 October, 2024 | 2:48 AM

మెఘాపై వెనుకంజ ఎందుకు?

13-08-2024 12:43:33 AM

సీఎం రేవంత్‌కు ఏలేటి ప్రశ్న

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): రూ.కోట్ల ప్రజాధనంతో పాటు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతో న్న మెఘా సంస్థపై చర్యలు తీసుకోవడానికి సర్కారు ఎందుకు వెనుకంజ వేస్తోందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ పాక్షికంగా కూలిన ఘటన కు పూర్తి బాధ్యత నిర్మాణ సంస్థదేనని వాటర్ బోర్డు చెప్పినప్పటికీ, ప్రభుత్వం స్పందించట్లేదని నిలదీశారు. సోమవా రం అసెంబ్లీ మీడియా హాల్‌లో మాట్లాడుతూ.. మెఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.

రేవంత్‌రెడ్డికి సుంకిశాల ప్రాజెక్టుపై ప్రేమ కంటే దాని ద్వారా వచ్చే కమీషన్లపైనే ఆసక్తి ఎక్కువగా ఉందన్నారు. అందుకే మెఘా కంపెనీ నాసిరకం పనులు చేస్తున్నా పట్టించుకోకుండా వెనకేసుకు వస్తున్నారని ఆరో పించారు. ఆ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షం లో ఉండగా రేవంత్‌రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ పెద్దలు ఆరోపించారని, ఇప్పుడు అధికారంలోకి రాగానే  మౌనంగా ఎందుకు ఉంటున్నారని అడిగారు. కమీషన్లకు ఆశపడి కాంగ్రెస్ సర్కారు మెఘాను వదిలేయడంతోనే సుంకిశాల ప్రమాదం జరిగిందని ఆరోపించారు.