calender_icon.png 28 October, 2024 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనాడ ఫాంహౌస్ ఎందుకు కూల్చట్లేదు?

30-08-2024 01:24:50 AM

  1. సల్కం చెరువును ఆక్రమించిన ఒవైసీ భవనాలకు నోటీసులేవి 
  2. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు29(విజయక్రాంతి): అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుతం మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందిన జనాడ ఫాంహౌస్‌ను ఎందుకు కూల్చడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తమ భవనాలపై చెయ్యేస్తే ప్రభుత అంతు చూస్తామంటూ అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరిస్తే.. ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇతర విద్యా సంస్థలకు నోటీసులి స్తూ కూల్చవేతకు సిద్ధమవుతున్న హైడ్రా అధికారులు.. అక్రమంగా నిర్మించిన ఒవైసీ విద్యా సంస్థలకు నోటీసులెందుకు ఇవడం లేదో సమాధానం చెప్పాలన్నారు.

గురువార ం బండి సంజయ్ సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియా తో మాట్లాడారు. సిరిసిల్లలో నేత కార్మికుల కరెంట్ బిల్లుల సబ్సిడీ విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుతంతోపాటు నేటి కాంగ్రెస్ ప్రభుతం కూడా దారుణంగా మోసం చే సిందని ఆరోపించారు. 50 శాతం సబ్సిడీ ఇ స్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని మండిపడ్డారు. మోసాల్లో ఒకరికొకరు మిం చిపోయారని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తీరును దుయ్యబట్టారు. 

జన్వాడ ఫాంహౌస్ విషయంలో హైడ్రా తీరు విస్మయం కల్గిస్తుందని అన్నారు. చేతనైతే అక్రమాలకు పాల్పడుతున్న పెద్దోళ్లను కొట్టి పేదోళ్లను ఆదుకోండని సూచించారు. రుణమాఫీపై సరే చేస్తామని ప్రభుతం చెప్పడం సిగ్గు చేటని మండిపడ్డారు. సిరిసిల్ల మున్సిపల్ విలీన గ్రామాల ప్రజల డిమాండ్లకు బీజేపీ సంపూర్ణ మద్దతిస్తొందని తెలిపారు.