మహబూబ్‌నగర్, జనవరి 19 ( విజయ క్రాంతి) : మానవ మనుగడకు అన్నం పెడుతున్న అన్నదాతపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని సిఐటియు రాష్ర్ట ఉపాధ్యక్షురాలు జయ లక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సదస్సు నిర్వహించారు.
ఈ సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు దేశంలో నేడు రైతులు మద్దతు ధర కోసం గిట్టుబాటు ధర కోసం, దేశ రాజధాని మరియు పంజాబ్, హర్యానా,బీహార్ రైతులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారని, రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దళావాలే 54 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నా డని ఆయనకు మద్దతుగా 111 మంది రైతు నాయకులు ఆమర దీక్షకు పునుకున్నారని,
నేడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యవసాయ కార్మిక రైతుల హక్కులను కాలరా స్తుందని, ఉపాధి హామీని దెబ్బతీస్తుందని, మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్భాటం తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రైతులకు న్యా యం జరిగే వరకు అందరం ఐక్యంగా ఉండే పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, వేణుగోపాల్, సత్యాన్న, వి కురుమూర్తి, వరద గాలన్న, గోనెల రాములు పాల్గొన్నారు.