calender_icon.png 20 October, 2024 | 6:13 PM

చెప్పిందేమిటి.. చేస్తున్నది ఏమిటి

20-10-2024 01:35:40 PM

రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది 

పంట కోసే సమయం వరకు కూడ రైతు భరోసా ఇవ్వకుంటే ఎలా?

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): చెప్పిందేమిటి చేస్తున్నది ఏమిటని, రైతుకు కష్టమంటే తెలియకుండా చేస్తామని రైతు భరోసాను అందిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ కూడా రైతు భరోసా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదంటూ బిఆర్ఎస్ నాయకులు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలలో నిరసన వ్యక్తం చేశారు. వెంటనే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఇప్పుడు చెప్పుకుంటూ వస్తూ పంట చేతికి వచ్చే సమయానికి కూడా రైతు భరోసా డబ్బులు ఇవ్వకుంటే రైతులు ఎలా సాగు చేస్తారని ప్రశ్నించారు. బాలనగర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాలియా నాయక్ ఆధ్వర్యంలో మండలంలోని ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను పలు ప్రాంతాల్లో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొని నిరసనకు మద్దతు తెలియజేశారు.