22-04-2025 02:11:22 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): 2016లో హెచ్‌సీయూలో జరిగిన ఘటనలపై రాహుల్ గాంధీ కన్నీరు పెట్టుకోగా.. ఆ కన్నీరు ఇప్పటికీ బలంగా ప్రవహిస్తున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. అయితే 2025లో అదే హెచ్‌సీయూలో జరిగిన ఘటనలపై ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నా రంటూ సోమవారం ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు. హ్యాష్‌ట్యాగ్ పొలిటికల్ అమ్నేసియా పేరు తో పోస్టు పెట్టారు. మీది సెలక్టివ్ మెమరీనా? లేదా సెలక్టివ్ పాలిటిక్సా? అని రాహుల్‌గాంధీని, హరీశ్‌రావు ప్రశ్నించారు.