calender_icon.png 18 March, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ఎందుకు?

18-03-2025 12:58:24 AM

కల్లూరు, మార్చి 17 :- మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులందరూ హాజరై నప్పటికీ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు ఎవ రూ ముందుకు రాకపోవడం గమనార్హం.ఈ విషయమై పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రజావాణిలో సమస్య పరిష్కరిం చాలని దరఖాస్తులు ఇవ్వడమే కానీ సమస్య లు పరిష్కారం కావడం లేదని చెప్పారు.

దరఖాస్తులకు జిరాక్స్ డబ్బులు దండగ అని అధికారులపై మండిపడ్డారు. రోజు వారి కూలికి వెళితే కానీ గడవని కుటుంబాలు కూలి పనులను వదిలి సమస్యలు పరిష్కా రం కోసం దరఖాస్తులు పట్టుకొని ప్రజావా ణి కోసం వస్తే సమస్యలు పరిష్కారం కాకపోగా రోజువారి కూలి కూడా నష్టపోతున్నా మని ఆవేధన వ్యక్తం చేశారు.