19-04-2025 12:00:00 AM
కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రజల తిరుగుబాటు తోనే బీఆర్‌ఎస్ ప్రభు త్వం కూలిపోయిందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌కు అంత అక్కసు ఎందుకని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం మల్లు రవి గాంధీభవన్‌లో పార్టీ నేతలు బండి సుధాకర్‌గౌడ్, శ్రీకాంత్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో బంగారు తెలంగాణ చేస్తానని, కేసీఆర్ కుటుంబమే బంగా రాన్ని వెనకేసుకుందన్నారు.
ప్రతిపక్షాలు రాత్రింబవళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడ మే పనిగా పెట్టుకున్నాయని మల్లు రవి విమర్శించారు. బంగ్లాదేశ్‌లో ప్రజలు తిరిగిపడినట్టు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారన్న కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. దేశ చరిత్రలో మొదటిసారి పేదల కోసం సన్నబియ్యం పంపిణీని తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇది విప్లవాత్మకమైన నిర్ణయమన్నారు.