calender_icon.png 30 April, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు బాధ ఎందుకైతుందో?

30-04-2025 12:00:00 AM

  1. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తాం

పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి , జిల్లా పరిశీలకులు సాంబయ్య

మహబూబ్ నగర్ ఏప్రిల్ 29 (విజయ క్రాంతి) : జరిగిన టిఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో కెసిఆర్ ఎందుకు బాధపడవలసి వచ్చిందో అర్థం కావడంలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.

జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరు శయశక్తులుగా కృషి చేయాలని సూచించారు. ధన బలంతో బిఆర్‌ఎస్ పార్టీ వరంగల్ లో సభ నిర్వహించిందని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పదేళ్లు అధికారం పెట్టుకొని కులగలను ఎందుకు చేయలేదని, ఎస్సీ వర్గీకరణ చేయవలసిన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసింది బీఆర్‌ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.

లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సిద్ధం కావాలని కోరారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి వైపు ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని సూచించారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శి వినోద్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బేక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.