06-04-2025 12:00:00 AM
ప్రపంచంలోని దాదాపు అన్ని స్కూల్, కాలేజీ బస్సులు పసుపు రంగులోనే ఉంటాయి. అయితే విద్యార్థులు ప్రయాణించే ఆ వాహనాలు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయనే కారణాలతో పాటు దాని వెనక దాగి ఉన్న సైన్స్ ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రంగుకు ఒక తరంగధైర్ఘ్యం ఉంటుంది. తరంగదైర్ఘ్యం ఎక్కువగా ఉంటే ఆ రంగు మన కంటికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎరుపు, నారింజ(ఆరెంజ్) ఆ తర్వాత పసుపు రంగుల్లో ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఎరుపు రంగును డేంజర్‌కు సంకేతంగా ఉపయోగిస్తారు.
అలాగే పింక్ అండ్ ఆరెంజ్ రంగులు కూడా ఎరుపును పోలీ ఉంటాయి. అందుకే వీటిని స్కూల్ బస్సులకు ఉపయోగించరు. ఈ రంగుల తర్వాత.. అందరి కళ్లకు స్పష్టంగా కనిపించేలా ఉండే (తరంగదైర్ఘ్యం ఎక్కువ ఉన్న) పసుపు రంగును స్కూల్ బస్సులకు వాడుతారు. పసుపు రంగులో ఉన్న స్కూల్ బస్సును దూరం నుంచి గుర్తించడానికి ఇతర వాహనదారులకు సులభం అవుతుంది. దీనివల్ల స్కూల్ వాహనాల ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. వర్షం, మంచు వంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా పసుపు రంగు క్లియర్‌గా కనిపిస్తుంది.