calender_icon.png 22 September, 2024 | 5:50 AM

కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయట్లే?

22-09-2024 01:30:43 AM

లక్ష్మణ్ బాపూజీని కేసీఆర్ సర్కారు అవమానించింది

బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): పొద్దున లేస్తే కులగణన గురించి మాట్లా డే  కాంగ్రెస్ పార్టీ 9 నెలలు గడిచినా తెలంగాణలో ఎందుకు కులగణన చేయడం లేదని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ప్రశ్నించారు. స్వాతంత్య్రం అనంతరం 50 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని నిలదీశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పారని... ఢిల్లీ కాంగ్రె స్, తెలంగాణ కాంగ్రెస్ రెండు వేరువేరా అని అన్నారు.

ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గమనించాలని కోరుతున్నామని తెలిపారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆచార్య కొం డా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి లక్ష్మణ్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగా ణ సాధన కోసం తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో బాపూజీ పాత్ర మరువలేనిదన్నారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం బాపూజీ కృషి అమోఘమన్నారు. చేనేత రంగం మీద ఆధారపడి జీవిస్తున్న పద్మశాలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిరి సిల్ల ఆత్మహత్యల జిల్లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి తన ఆశ్రమాన్నే ఇచ్చి న కొండా లక్ష్మణ్‌కు కేసీఆర్ సర్కారు ఉండేందుకు కనీసం ఇళ్లు  కూడా ఇవ్వలేదని, బీఆర్‌ఎస్ పాలనలో బాపూజీ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించలేదని లక్ష్మణ్ విమర్శించారు.