calender_icon.png 22 February, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాబ్‌లోనే ఎందుకు?

15-02-2025 01:11:01 AM

అమృత్‌సర్‌లో దిగనున్న మరో అమెరికా వలస విమానం

  1. సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం

అమృత్‌సర్, ఫిబ్రవరి 14: అమెరికాలో బహిష్కరణకు గురైన భారతీయలను తీసుకొస్తున్న ప్రత్యేక విమానాలను అమృత్‌సర్‌లో దించాలని నిర్ణయించడంపట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్రతోనే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఆ విమానాలను పంజాబ్‌లో కాకుండా ఢిల్లీలో దించే ఏర్పాట్లు ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. శనివారం చేరుకునే రెండో విమానంలో 119 మంది ఉండగా అందులో 67 మంది పంజాబ్‌కు చెందిన వారే కావడం వల్ల అమృత్‌సర్‌లో విమానాన్ని దించేందుకు ఏర్పాట్లు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.

అలా అయితే మొదట వచ్చిన విమానాన్ని అహ్మదాబాద్‌లో ఎందుకు దించలేదు? అని ప్రశ్నించారు. కాగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న భారతీయులను ఇండియాకు తరలిస్తున్న మరో రెండు విమానాలు ఈ నెల 15, 16 తేదీల్లో అమృత్‌సర్‌లో దిగనున్నాయి.