రాష్ట్ర టూరిజం, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు
కామారెడ్డి, జనవరి 7 (విజయక్రాంతి): కేటీఆర్ తప్పు చేయనప్పుడు కోర్టుకెందుకు వెళ్లారని రాష్ట్ర టూరిజం, ఎక్సైజ్ శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఏసీబీ విచారణకు కేటీఆర్ సహక రించాలని సూచించారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఇప్పటికే భూస్థాపితం అయ్యిందని, మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది కల్ల అని చెప్పారు. అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్‌ఎస్ నేత లు బురద జల్లుతున్నారన్నారు.
రాజకీ య లబ్ధి కోసమే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.