మహేశ్వర్‌రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ ఆగ్రహం
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి రోజు రోజుకు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాకుండా పోతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ ఎల్పీ నాయకుడు ఇద్దరూ అగ్రవర్ణాల వారేనని, అందుకే కులగణనకు వ్యతిరేంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌కుమార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆ పదవి నుంచి ఆయన్ను పీకేశారని, అగ్రవర్ణాలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. బీజేపీఎల్పీ పదవి ఎప్పుడు పోతుందో తెలియక తికమకగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
2015లో నిర్మల్‌లో రాహుల్‌గాంధీ పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్న మహేశ్వర్‌రెడ్డికి రాహుల్ కులమేంటో తెలియదా అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. రాహుల్‌గాంధీది ఏ కులం అంటున్న బీజేపీ నాయకులు..
2025లో చేపట్టే జనగణనలో ఓబీసీ గణన అంశం చేర్చాలని ప్రధాని మోడీని అడగాలని, అప్పుడు రాహుల్‌ది ఏ కులమో తెలుస్తుందన్నారు. రాహుల్‌గాంధీలో బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే తపన ఉందన్నారు. అందరూ ఒప్పుకునే నాయకుడు రాహుల్‌గాంధీ అనే విషయం తెలుసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు.