calender_icon.png 25 April, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకెందుకివ్వరు వేసవి సెలవులు

25-04-2025 02:33:54 AM

కలెక్టరేట్ ముందు ధర్నా చేసి ఏవకు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్

మహబూబ్ నగర్ ఏప్రిల్ 24 (విజయ క్రాంతి) : చిన్నారులకు, గర్భిణీ, బాలింతల ఆరోగ్య పోషకాలను అందిస్తూ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తూ శ్రమిస్తున్న అంగన్వాడీ టీచర్స్, హె ల్పర్స్ లకు ఎందుకు వేసవి సెలవులు ఇవ్వరని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ప్రశ్నించారు. గురువారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ ఏవో కు వారి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.

గతంలో మంత్రి సీతక్క తమకు హామీ ఇవ్వడం జరిగిందని మే నెల స మీపిస్తున్న నేటికీ జీవో విడుదల చేయలేదని తెలిపారు. మే నెల మొత్తం తమకు సెలవులు ప్రకటించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కురుమూర్తి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కవిత, సరోజ, గౌసియా, సుగుణ, సువర్ణ, గౌస్య, నరసమ్మ ,రేణుక, చంద్రకళ లక్ష్మీ రాజ్యలక్ష్మి,, నాగమణి, లీల ప్రభావతి పాల్గొన్నారు.