calender_icon.png 27 October, 2024 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలు నీరసంగా ఉంటున్నారా?

18-05-2024 12:05:00 AM

ఒక వైపు వర్షం పడుతూ.. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఈ రెండింటికి మధ్య ఉష్ణోగ్రతలు పెరగడం, తగ్గడం జరుగుతోంది. ఒకపక్క విపరీతమైన ఉక్కపోత కూడా వేధిస్తోంది. దీంతో పెద్దలే నీరసంతో ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడ్డది. ఇక ప్రత్యేకంగా చిన్నా రుల గురించి చెప్పేది ఏముంది. విపరీతమైన ఎండల కారణంగా పిల్లలు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా దాహం బాగా వేస్తుంది. దీంతో ఎక్కువ నీళ్లు తాగుతున్నారు. ఈ కారణంగా ఆహారం తీసుకోవడం సహజంగానే తగ్గిపోతుం ది. ఈ కారణంగా చిన్నారులకు అందాల్సిన పోషకాలు లభించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులకు పోషకాలు సరిగ్గా అందాలంటే కొన్ని రకాల పండ్లను కచ్చితంగా అందించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

1. స్ట్రాబెర్రీ ద్వారా పోషకాహారం ఎక్కువగా లభిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో విటమిన్  ‘సి’ పుష్కలంగా ఉంటుం ది. ఇది పిల్లలను యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. ఇన్‌స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది.

2. నీటి శాతం పుష్కలంగా ఉండే పుచ్చకాయను చిన్నారులకు కచ్చితంగా అందించాలి. ఇందులో పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సిలు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపయోగడుతుంది. అలాగే దాహాన్ని తీర్చడంతో పాటు కడుపును తేలికగా ఉండేలా చేస్తుంది.

3. బొప్పాయి జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులోని పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో పిల్లల ఆరోగ్యానికి అవస రమైన సి, ఎ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నీరసంతో ఇబ్బంది పడే వారికి తక్షణ శక్తిని అందిస్తుంది.

4. వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. చిన్నారులు ఎంత ఇష్టంగా తింటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని విటమిన్ సి, ఎ చర్మం, కళ్ల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా మామిడి పండు తిన డం వల్ల ఇన్‌స్టాంట్ ఎనర్జీ లభిస్తుంది.

5. కర్బూజ పండు ఆరోగ్యానికి చాలా మంచి ది. దీంట్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది పిల్లలను హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇందులోని పుష్కలంగా లభించే విటమిన్ ఏ, బీ6, సీ  రోగనిరోధక శక్తిని పెంచుతాయి.