calender_icon.png 20 January, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం అయ్యాక మీ వైఖరి ఎందుకు మారింది?

17-12-2024 12:33:43 AM

ఒమర్ అబ్దుల్లాకు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్

శ్రీనగర్, డిసెంబర్ 16:  ‘ఎలక్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీ ఎంల)ను నిందించడం మానుకుని, కాంగ్రెస్ పార్టీ ఫలితాలను అంగీకరించాలి. ఎన్నికలపై నమ్మకం లేన ప్పుడు అసలు పోటీ చేయకూడదు. ఈవీఎంలతో సమస్య ఏదైనా ఉంటే దానిపై పోరాటం చేయాలి’ అని ఇటీవల జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు రాజకీయపరంగా దుమారం చేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై  తాజాగా కాంగ్రె స్ ఎంపీ మాణికం ఠాకూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి అయ్యాక ఒమర్ అబ్దుల్లా వైఖరి పూర్తిగా మారిపోయిందని విమర్శించారు. ఇన్నాళ్లూ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండి, అధికార పగ్గాలు చేపట్టాక మిత్రపక్షాల ఆలోచనకు భిన్నంగా వ్యవహ రిస్తున్నారని మండిపడ్డారు.