హైదరాబాద్: తెలంగాణ శాసననభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... బీసీల రిజర్వేషన్ల పెంపుపై 42 శాతం చట్టబద్దత తీసుకువస్తారని తాము భావించామన్నారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) చట్టం తీసుకురావాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt)లో కేసీఆర్(KCR) చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో 3.68 కోట్ల మంది పాల్గొన్నారని, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 61 శాతం(సంఖ్య 1.85 కోట్లు) ఉన్నారని గుర్తుచేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల సర్వే ప్రకారం బీసీల శాతం, సంఖ్య ఎందుకు తగ్గింది..? అని ప్రశ్నించారు.